కాజల్ అగర్వాల్ చేతిలో ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’, ‘ఆచార్య’ సినిమాలు ఉన్నాయి. పైగా ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’లో కూడా కథానాయికగా ఆమె అవకాశం దక్కించుకుంది. ఇలా మొత్తం నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళింది. తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కాజల్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
సూర్య – హరి కాంబినేషన్ కి భారీ క్రేజ్ ఉంటుంది. గతంలో సూర్య, హరిల కాంబినేషన్లో ‘సింగం, ఆరు, వేల్’ లాంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమాలో కాజల్ హీరోయిన్ అంటే. కచ్చితంగా కాజల్ కి ఇది బంపర్ ఆఫరే. త్వరలోనే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రావొచ్చని వార్తలు వస్తున్నాయి.
అయితే సూర్యను ఎక్కువుగా పోలీస్, మాస్ కథల్లో చూపిన హరి, ఈసారి ఫ్యామిలీ స్టోరీలో చూపించబోతున్నారు. సూర్య పూర్తి స్థాయి కుంటుంబ కథా చిత్రం చేసి చాల కాలం అయింది. ఒకరకంగా వీరి గత చిత్రం ‘వేల్’ తరహాలో ఉంటుందట ఈ కొత్త చిత్రం. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.