తమిళ్ స్టార్ సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సూర్య రెండు విభిన్న గెటప్స్ లో కనిపించానున్నాడని సమాచారం.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ సినిమా కోసం హై డెఫినిషన్ రెడ్ డ్రాగన్ కెమెరా సిస్టం ని వాడుతున్నారు. ఈ కెమెరాని ఇండియాలో ఇప్పటివరకూ ఉపయోగించలేదు. 2104లో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.