గోవాలో సూర్య- సమంత

గోవాలో సూర్య- సమంత

Published on Jan 17, 2014 1:08 AM IST

surya-samantha (1)
లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషలలో ఈ యేడు విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కు అంజాన్ అనే పేరు ఖరారయింది

గతకొన్ని రోజులుగా మీడియా వార్తల ప్రకారం సూర్య ఈ సినిమాలో కళ్ళు చెదిరే లుక్ తో గ్యాంగ్ స్టర్ పాత్రలో అలరించనున్నాడు. సమంత హీరొయిన్. కొన్ని ముఖ్య సన్నివేశాలను వీరినడుమ గోవాలో చిత్రీకరించారు. చెన్నైలో ఇప్పటికే సూర్య, మారియమ్ జాకారియా తో ఒక పాటను తీసారు

సమాచారం ప్రకారం తిరుపతి బ్రదర్స్ తో పాటు ఈ సినిమాను యు.టి.వి మోషన్ పిక్చర్స్ కలిపి నిర్ణయం తీసుకుందాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. సంతోష్ సివన్ సినిమటోగ్రాఫర్. యముడు 2 తరువాత సూర్య ఆ ఊపును కొనసాగిస్తాడో లేదో చూడాలి

తాజా వార్తలు