ఈ రోజు సూర్య “బ్రదర్స్” చిత్ర ఆడియో విడుదల

ఈ రోజు సూర్య “బ్రదర్స్” చిత్ర ఆడియో విడుదల

Published on Sep 29, 2012 11:12 AM IST

సూర్య రాబోతున్న చిత్రం “బ్రదర్స్” చిత్ర ఆడియో ఈరోజు హైదరాబాద్ తాజ్ కృష్ణ లో విడుదల కానుంది. కే వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. సూర్య మరియు కే వి ఆనంద్ కాంబినేషన్లో గతంలో “ఆయన్(వీడోక్కడే) చిత్రం రావడం ఈ అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రంలో సూర్య అవిభక్త కవలల పాత్రలో కనిపించనున్నారు. కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సూర్య మొదటి సారిగా తెలుగులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం వరకు చెన్నై,హైదరాబాద్ మరియు యూరప్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో కాజల్ కాకుండా ఇద్దరు రష్యన్ భామలు ముఖ్య పాత్రలు పోషించినట్టు తెలుస్తుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తుండగా హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది.

తాజా వార్తలు