బ్రదర్స్ చిత్రం గురించి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న సూర్య

బ్రదర్స్ చిత్రం గురించి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న సూర్య

Published on Oct 8, 2012 9:42 PM IST


సూర్య మరియు కే వి ఆనంద్ కాంబినేషన్లో రాబోతున్న మరో చిత్రం “బ్రదర్స్” చిత్ర విజయం గురించి సూర్య పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం కోసం సూర్య దాదాపుగా 170 రోజులు కష్టపడ్డారు ఇదే కాకుండా కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేయించారు.కే వి అనడ్న అద్భుతమయిన కథతో తన వద్దకు వచ్చాడని ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేశాడని సూర్య అన్నారు. ఈ చిత్రంలో సూర్య అవిభక్త కవలలుగా కనిపించనున్నారు. చిత్రంలో దాదాపు 40 నిమిషాల పటు అయన ఇలా కనిపించనున్నారు. మిగిలిన చిత్రం యాక్షన్, రోమాన్స్ మరియు ఫ్యామిలీ డ్రామాతో నడుస్తుంది. ఈ చిత్రంలో కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ అంతటా విడుదల చేస్తున్నారు.హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది.

తాజా వార్తలు