
“ప్రేమిస్తే”,”షాపింగ్ మాల్” మరియు “జర్నీ” వంటి పలు చిత్రాలను అనువదించిన సురేష్ కొండేటి మరో తమిళ చిత్రాన్ని అనువదించడానికి సిద్దమయ్యారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన “పిజ్జా” చిత్ర డబ్బింగ్ మరియు రీమేక్ హక్కులను సురేష్ కొండేటి సొంతం చేసుకున్నారు. “పిజ్జా” చిత్రం తమిళంలో భారీ విజయం సాదించింది పలువురు దర్శకులు మరియు నటులు ఈ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తారు. విజయ్ సేతుపతి మరియు రేమ్యా నమ్బీసన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం కోసం దాదాపుగా 40 మంది నిర్మాతలు పోటీ పాడగా సురేష్ కొండేటి ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తమిళంలో లానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ విజయం సాదిస్తుంది అని సురేష్ కొండేటి ధీమాగా ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.