ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కరోనా కారణంగా రాబోయే రోజులు ఎలా ఉంటాయి ? థియేటర్స్ సిస్టమ్ లో ఎలాంటి మార్పులొస్తాయి ? లాంటి విషయాలు చెప్పారు. మరో నాలుగు నెలలు వరకూ థియేటర్స్ తెరిచిన ఉపయోగం లేదని, అందుకే పెద్ద సినిమాలు షూట్ చేయడం కూడా అనవసరమని తెలిపారు. ఓటిటీ కోసం తానూ వెబ్ సిరీస్ లను, చిన్న సినిమాలను నిర్మిస్తానని సురేష్ బాబు తెలిపారు.
అలాగే తనకు వ్యవసాయం అంటే ఇష్టమని దాని పై దృష్టి పెడుతున్నానని, క్రమంగా నిర్మాణ రంగానికి కూడా దూరం అవుతానని , అలాగే హైదరాబాద్ లోని నానక్ రామ్ స్టూడియో ప్లేస్ లో అపార్ట్ మెంట్లు కట్టే ప్లాన్ కూడా ఉందని, అయితే నానక్ రామ్ స్టూడియో కంటే ఇంకా పెద్ద స్టూడియో కడతానని సురేష్‌బాబు తెలిపారు. రానాకి సినిమా అంటే ఫ్యాషన్ అని, సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు అన్ని భవిష్యత్తులో తనే చూసుకుంటాడని కూడా చెప్పారు.