రీసెంట్ గా తన ఒక్క సినిమా తోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ రీచ్ అందుకున్న టాలెంటెడ్ నటుల్లో అనిమల్ సినిమాలో కొంచెం సేపే కనిపించినప్పటికీ గట్టి ఇంపాక్ట్ చూపించిన నటుడు ఉపేంద్ర లిమాయె కూడా ఒకరు. అక్కడ నుంచి మరిన్ని సినిమాల్లో కనిపించిన తాను ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం, రీసెంట్ గా మాస్ హిట్ జాట్ సినిమాల్లో కనిపించారు.
అయితే ఇదే నటుడు ఇపుడు మళ్ళీ అనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కలిసి కనిపించడం క్రేజీగా మారింది. సందీప్ భద్రకాళి ఆఫీస్ లో మెగాస్టార్ మాస్ ఫ్రేమ్ ముందు రెడ్డి బ్రదర్స్ తో కలిసి ఈ టాలెంటెడ్ నటుడు కూడా కనిపించడం వైరల్ గా మారింది. దీనితో ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ లో కూడా ఈ మాస్ నటుడు కనిపిస్తాడని టాక్ మొదలైంది. మొత్తానికి మాత్రం ఈ మ్యాడ్ ఫ్రేమ్ మంచి ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చింది.