సూపర్ స్టార్ కృష్ణ వంశం నుంచి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు. ప్రస్తుతం సుదీర్ బాబు ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాల ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన జె. ప్రభాకర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి మారుతి కథ – డైలాగ్స్ అందించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సుధీర్ బాబు – నందిత జంటగా నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ – శ్రీ దేవి కలిసి నటించిన ‘పచ్చని కాపురం’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘వెన్నెలైనా చీకటైనా’ సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాలోనే ప్రధాన హైలైట్ అవుతుందంటున్నారు. జె.బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్, పాటలు ఉండవని మారుతి చెప్పాడు.