ఎందుకంటే ప్రేమంట లోగోకు విశేష స్పందన

ఎందుకంటే ప్రేమంట లోగోకు విశేష స్పందన

Published on Apr 9, 2012 12:47 PM IST


యువత ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్ర లోగో నిన్న రామానాయుడు స్టుడియోలో జరిగిన విషయం తెలిసిందే. అగ్ర దర్శకుడు రాజమౌళి ఈ చిత్ర లోగోని ఆవిష్కరించారు. పలువురి పెద్దల సమక్షంలో ఆవిష్కరించిన ఈ లోగోకి యువత నుండి మరియు సినీ ప్రేమికుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. రామ్ మరియు తమన్నాల జంట చూడ ముచ్చటగా ఉందంటూ కితాబునిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు కరుణాకరన్, నిర్మాత స్రవంతి రవికిషోర్, రామ్, తమన్నా, రచయిత కోన వెంకట్ హాజరయ్యారు. ఎందుకంటే ప్రేమంట చిత్రం మే 11న విడుదలకు సిద్ధమవుతుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఆడియో ఏప్రిల్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు