మాస్ నెంబర్‌గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర మాస్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘సూపర్ డూపర్’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట పూర్తి మాస్ నెంబర్‌గా అదిరిపోయే ట్యూన్స్, డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం.. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు కలగలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాలో ఈ ‘సూపర్ డూపర్’ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version