కరోనా వైరస్ వ్యాప్తితో చిగురుటాకులా ఒణికిపోయిన చైనా చాలా ప్రయత్నం తరువాత ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తుంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనితో అక్కడ ప్రజల జీవితాలు నార్మల్ స్థితికి వస్తున్నాయి. కాగా కరోనా వైరస్ వ్యాప్తి తరువాత అక్కడ విడుదల కానున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 నిలువనుంది. ఈ విషయాన్నీ ఆ చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
ఇప్పటికే నిర్మాతలు చైనా సెన్సార్ కొరకు అప్ప్లై చేశారట. సెన్సార్ పూర్తయిన వెంటనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తారట. ఇక సూపర్ 30 బీహార్ కి చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు వికాస్ బాల్ ఈ చిత్రన్ని తెరకెక్కించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకోవడంతో పాటు, కమర్షియల్ గా కూడా విజయం సాధించింది.