వరల్డ్ వైడ్ ‘జాట్’ 3 రోజుల సాలిడ్ వసూళ్లు.!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “జాట్” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో గోపీచంద్ హిందీ సినిమాలోకి ఎంటర్ అవ్వగా ఇపుడు హిందీ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుంది. అయితే ఈ చిత్రం మొదటి రెండు రోజులు కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో మంచి వసూళ్లు సాధించగా ఇపుడు మూడో రోజు కూడా మరింత స్ట్రాంగ్ నంబర్స్ నమోదు చేసింది.

వరుసగా మూడో రోజు కూడా 10 కోట్లకి పైగా గ్లోబల్ నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మొత్తం 32.2 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ ఆదివారం కూడా జాట్ కి మరింత ప్లస్ కానుండగా దీనితో 40 కోట్ల మార్క్ ని దాటినా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version