కామెడీ హీరో సునీల్ నటించిన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యు సర్టిఫికేట్ ఇచ్చారు. మార్చ్ 1న విడుదల కానున్న ఈ సినిమా హిందీ సినిమా ‘తను వెడ్స్ మను’ కి రీమేక్. సునీల్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది, తను సునీల్ తో కలసి నటించిన రెండవ సినిమా. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ ప్రసాద్ డైరెక్టర్, ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు.