భీమవరం బుల్లోడుపై నమ్మకంగా ఉన్న సునీల్

భీమవరం బుల్లోడుపై నమ్మకంగా ఉన్న సునీల్

Published on Feb 2, 2014 10:08 AM IST

Bheemavaram-Bullodu-First-L
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత సునీల్ త్వరలోనే మరో యాక్షన్ కామెడీ మూవీ ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురించి సునీల్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడి కథ. నేను హీరోగా చేసిన సినిమాల్లో ఇప్పటి వరకూ నాకు లవ్ ట్రాక్ లేదు, మొదటి సారి భీమవరం బుల్లోడులో నేను హీరోయిన్ చూసి ప్రేమలో పడతాను. ఇది బాగా కామెడీ ఉండే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. అందరికి నచ్చుతుందని నమ్మకంగా ఉన్నానని’ అన్నాడు. ఈ సినిమాలో మరో సాంగ్ జత చేయనున్నారా అని అడిగితే ‘నేను హీరో ఇంట్రడక్షన్ సాంగ్ విన్నప్పుడు నాకు అది అంతగా నచ్చలేదు. అందుకే దాన్ని ఆడియో ఆల్బంలో తీసేసాం. కానీ సినిమాలో ఉంటుందని’ తెలిపాడు.

తాజా వార్తలు