అల్లరోడి సినిమాలో మెరవనున్న సునీల్, పోసాని

అల్లరోడి సినిమాలో మెరవనున్న సునీల్, పోసాని

Published on May 28, 2013 7:34 PM IST

Sunil-and-posani

కామెడీ హీరో సునీల్, విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అల్లరి నరేష్ హీరోగా రానున్న కామెడీ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’ లో కనిపించనున్నారు. వీరిద్దరూ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరూ ఎక్కడా వస్తారా అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సినిమా జూన్ మొదట్లో విడుదల కానుంది.

అల్లరి నరేష్, రాజు సుందరం, వైభవ్, శ్యామ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని, షీన, రీతు బర్మేచ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాని అత్యాధునిక సాంకేతిక విలువలతో చిత్రీకరించారు. ఈ సినిమాలోని 3డి ఎఫెక్ట్స్ హై రేంజ్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అనీల్ సుంకర దర్శకనిర్మాతగా తీసిన ఈ సినిమాకి బప్ప – బప్పి లహరి సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు