సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్స్ లో రెండు పాటలు, ఎక్కువ భాగం టాకీ పార్ట్ షూట్ చేశారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో 10 రోజులు టాకీ పార్ట్ అలాగే మూడు పాటలను షూట్ చేయనున్నారు. ఆనంద్ రంగా – శేషు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా బోస్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అచ్చు సంగీతం అందిస్తున్నాడు.
ఇది కాకుండా సందీప్ కిషన్ నటించిన ‘డీ ఫర్ దోపిడీ’, ‘గుండెల్లో గోదారి’ సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి.