సందీప్ కిషన్ తమిళ్ సినిమాకు మంచి స్పందన

సందీప్ కిషన్ తమిళ్ సినిమాకు మంచి స్పందన

Published on Apr 26, 2013 9:37 AM IST

sandeep-and-dimple-cute-smi
ఈ రోజు తమిళనాడులో విదుదలైన సందీప్ కిషన్ తమిళ్ సినిమా ‘యారుడ మహేష్’ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించింది. మొదటిరోజు మంచి కలెక్షన్స్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ‘మారన్ థెన్ మన్నితేన్’ సినిమాలో ప్రధాన పాత్ర ద్వారా తమిళ్ ప్రేక్షకులకు అతను సుపరిచితుడే. ఆర్ మదన్ కుమార్ ఈ సినిమాను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డింపిల్ చోపడే హీరొయిన్. మహేష్ అనే పాత్రను వెతకడం కోసం హీరో చుట్టూ తిరిగే సినిమా ఇది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను తెలుగులోకి అనువదించనున్నారు. దీని అనువాద హక్కులను సురేష్ కొండేటి దక్కించుకున్నారు. ‘మహేష్’ అనే పేరును తెలుగు వెర్షన్ కు ఖరారు చేసారు. ఈ సినిమా వేసవి చివర్లో విడుదలకానుంది. ఈ సినిమా కాకుండా సందీప్ కిషన్ ‘డి ఫర్ దోపిడీ’ మరియు ‘డి.కె బోస్’ సినిమాలలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు