‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా విజయం తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ప్రస్తుతం చాలా బిజీ బిజీ గా సాగిపోతోంది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా కోసం ఇప్పటికీ థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ నిర్మాతగా మారి ఓ కొత్త అవతారాన్ని ఎత్తనున్నాడు.
త్వరలోనే అతను ‘అ సైలెంట్ మెలోడి’ అనే షార్ట్ ఫిల్మ్ ని నిర్మించనున్నట్లు తెలిపాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కి కథ – దర్శకత్వం ప్రశాంత్ వర్మ. త్వరలోనే దీనిని యు ట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని వారు ఈ షార్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయిన విరించి వర్మ, పవన్ సాధినేని లాంటి వారు డైరెక్టర్స్ గా సక్సెస్ అయ్యారు. వీరి జాబితాలో ప్రశాంత్ వర్మ కూడా చేరుతాడని ఆశించవచ్చు.
సందీప్ కిషన్ ప్రస్తుతం రా రా కృష్ణయ్య, కుమార్ నాగేంద్ర డైరెక్షన్లో చేస్తున్న సినిమాల్లో బిజీ గా ఉన్నాడు.