చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ తెలుగు తెరపై మెరవనున్నారు. సందీప్ 2010 లో వచ్చిన ‘స్నేహగీతం’ చిత్రంలో కనిపించాడు, అంతక ముందు ‘ప్రస్థానం’ సినిమాలో కనిపించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ ‘గుండెల్లో గోదారి’ మరియు ‘రొటీన్ లవ్ స్టొరీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. ‘ ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో నేను చాలా కొత్తగా కనిపిస్తాను. ఈ చిత్రంలో కోడి పుంజు పందెం లకు అలవాటు పడిన ఒక గ్రామీణ యువకుడి పాత్రను పోషించాను మరియు ఒక చాలెంజ్ గా తీసుకొని ఆ పాత్ర చేసాను’ అని సందీప్ అన్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, తాప్సీ, ఆది మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కుమార్ నాగేందర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1986లో జరిగిన వరదల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.