సుమంత్ హీరోగా నటిస్తున్న ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని డిసెంబర్ 2వ వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో మరియు థియేటర్ రిలీజ్ తేదీలను అధికారికంగా తెలియజేయనున్నారు.
చంద్ర సిద్దార్థ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ కంచి కథని అందించారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అంతా ఫైనల్ అవుట్ పుట్ విషయంలో చాల హ్యాపీగా ఉన్నారు. థాయ్ నటి పింకీ సావిక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కానుంది. పూదోట సుదీర్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.