మారుతిని సపోర్ట్ చేసిన సుమంత్ అశ్విన్

మారుతిని సపోర్ట్ చేసిన సుమంత్ అశ్విన్

Published on Aug 26, 2013 3:36 PM IST

sumanth-ashwin
గత శుక్రవారం విడుదలైన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హీరో సుమంత్ అశ్విన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ రోజు సుమంత్ అశ్విన్ కాసేపు మీడియా మిత్రులతో ముచ్చటించారు. అప్పుడు ఓ మీడియా మిత్రుడు సుమంత్ ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు.

‘ మీరు ఇప్పటి వరకు చాలా క్లీన్ గా ఉండే సినిమాల్లో కనిపించారు. మీ తదుపరి మూవీ మారుతితో చేస్తున్నారు. అడల్ట్ థీమ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ విషయంలో మారుతికి మంచి పేరుంది. ఆ విషయంలో మీరెలా ఫీలవుతున్నారు?’ అని అడిగితే..

సుమంత అశ్విన్ వెంటనే సమాధానం చెబుతూ ‘ మీరెందుకు మారుతిని అదే యాంగిల్ లో చూస్తున్నారు. ప్రేమ కథా చిత్రమ్ తీసుకోండి. అది సూపర్బ్ మూవీ. ఒకవేళ మీరు అతను అడల్ట్ కామెడీనే చూపించాడు అని అనుకుంటే అనుకోండి అందులో తప్పేముంది. ప్రేక్షకులు అలాంటి సినిమాలే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకి హాలీవుడ్ లో వచ్చిన అమెరికన్ పై సీరస్ నే తీసుకోండి. ఆ సినిమాలకు రేటింగ్స్ సరిగా ఇవ్వలేదు, మంచి రివ్యూలు పడలేదు కానీ ఆ సినిమాలు బాగా ఫేమస్. నేను మారుతితో చేస్తున్న సినిమాలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. అది క్లీన్ ఎంటర్టైనర్’ అని అన్నాడు.

అలాగే సుమంత్ అశ్విన్ తెలుగు ప్రేక్షకుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ‘ తెలుగు సినిమా ప్రేక్షకులకు అన్నీ తెలుసు. వారికి మంచి కామెడీ సెన్స్ ఉంది. వాళ్ళు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తే మెచ్చుకుంటారు. అది ప్రయోగాత్మక సినిమా అయినా లేదా కొత్త థీం లైన్ అయినా ఆ సినిమాలో అన్నీ సమపాళ్ళలో ఉంటే వాళ్ళు ఆదరిస్తారు. దానికి అంతక ముందు ఆ తరువాత సినిమానే ఉదాహరణ’ అని సుమంత్ అన్నాడు.

చివరిగా సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటికి, నిర్మాత దామోదర ప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపాడు.

తాజా వార్తలు