సుమన్ ప్రధాన పాత్రలో “రామప్ప”

సుమన్ ప్రధాన పాత్రలో “రామప్ప”

Published on Oct 9, 2012 1:48 AM IST


వరంగల్లోని రామప్ప ఆలయం అంటే రాష్ట్రమంతటా ప్రసిద్ది. కాకతీయుల కాలం నుండి ఉన్న ఈ ఆలయం గురించి ప్రస్తుతం ఒక చిత్రం తెరకెక్కుతుంది. “రామప్ప” అన్న పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పాత్రలలో మరో నూతన జంట కనిపించనున్నారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా. కుమార్ మరబోయిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 10 నుండి ఈ చిత్రం మొదలు కానుంది వరంగల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సంగీత దర్శకుడు చక్రి ఒక ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. నాగేంద్ర కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు