చివరి షెడ్యూల్లో సుకుమారుడు

Sukumarudu-stills
ఆది హీరోగా నటిస్తున్న ‘సుకుమారుడు’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. శ్రీ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై కె.వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అశోక్.జి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిషా అగార్వాల్, భావన రుపరెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక పాటని ఈ మద్య హైదరాబాద్లో ఆది, నిషా అగార్వాల్, భావనలపై చిత్రీకరించారు, అలాగే మిగిలిన సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమా నిర్మాణం చాలా నెమ్మదిగా సాగింది. ఈ వారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. కృష్ణ, ఉర్వశి శారదలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ తరువాత విడుదలకావచ్చు.

Exit mobile version