‘తునీగ తూనీగ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ అశ్విన్ ఇటీవలే విడుదలైన ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాలోని నటనతో అందరినీ మెప్పించగలిగాడు
త్వరలో మారుతి తీయబోతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనున్న ఇతనికి మరొక సినిమా అవకాశం వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న సినిమాలను తీయనున్నాడన్న విషయం ఇప్పటికే మీకు తెలియజేశాం. తన మొదటి ప్రాజెక్టు కోసం సుకుమార్ సుమంత్ అశ్విన్ ను ఎంచుకున్నాడు
వేమా రెడ్డి ఈ సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారుకాలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం