సుడిగాడు అనుకోని విజయాన్ని సాదించనుందా?


కామెడీ కింగ్ అల్లరి నరేష్ సడన్ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుడిగాడు’. ఆసక్తి కరమైన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకులముందుకు రానుంది. తెలుగులోఇప్పటివరకు సూపర్ హిట్ అయిన చిత్రాల్లోని సన్నివేశాలను తీసుకొని ఈ చిత్రంలో హాస్యాస్పదమైన పేరడీ చేశారు. ఆ సన్నివేశాలను ఎంతో హాస్యంగా మరియు ఎంతో పాజిటివ్ గా తీయడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

ఆగస్టులో చాలా పెద్ద సినిమాలు విడుదల ఉండడంతో ప్రేక్షకుల దృష్టి అంతా ఆ చిత్రాల మీదే ఉంది. ‘సుడిగాడు’ చిత్ర కాన్సెప్ట్ కనుక సినీ అభిమానులకు బాగా నచ్చితే పెద్ద సినిమాల విడుదలలు ఎమన్నా వాయిదా పడే అవకాశం ఉంటుంది. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు.

Exit mobile version