జూన్ 7న విడుదలకానున్న ‘ప్రేమ కథా చిత్రమ్’

జూన్ 7న విడుదలకానున్న ‘ప్రేమ కథా చిత్రమ్’

Published on May 25, 2013 1:30 PM IST

Prema-katha-chitram

సుదీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా జూన్ 7న విడుదలకానుంది. ఈ విషయాన్ని ఫిల్మ్స్ ప్రెస్ రిలేషన్ టీం తెలియజేసింది. మొదట ఈ సినిమాని మే 4న విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని జూన్ 7 విడుదల చేయడానికి ఈ సినిమా నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. సుదీర్ బాబు హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ ఫ్రేం మారుతీ ఈ సినిమాకు డైలాగ్స్ ను అందించారు. జెబీ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు మారుతీ కూడా ఒక నిర్మాత. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుందని సుదీర్ బాబు చాలా నమ్మకంగా వున్నాడు.

తాజా వార్తలు