మరో రొమాంటిక్ చిత్రంలో సుదీర్ బాబు

మరో రొమాంటిక్ చిత్రంలో సుదీర్ బాబు

Published on Nov 16, 2012 10:27 PM IST


ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) చిత్రం వచ్చి దాదాపుగా ఎనిమిది నెలల తరువాత సుదీర్ బాబు మరో చిత్రం చెయ్యనున్నారు. “ప్రేమకథాచిత్రం” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ” నీకు నాకు డాష్ డాష్” ఫేం నందిని కథానాయికగా కనిపించనుంది. ఈరోజు రామానాయుడు స్టుడియోస్లో జరిగిన ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. “ఈ రోజుల్లో” “మరియు “బస్ స్టాప్” వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ అయిన జే ప్రభాకర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ పి ఏ క్రియేషన్స్ అండ్ మారుతీ మీడియా హౌస్ బ్యానర్ మీద సుదర్శన్ రెడ్డి మరియు మారుతీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీర్ బాబుకి ఈ కథ చాలా నచ్చి చేస్తున్నారని, నందిని ఈ పాత్రకి సరిగ్గా సరిపోయే నటి అని అన్నారు. “బస్ స్టాప్” చిత్రానికి పని చేసిన బృందమే ఈ చిత్రానికి కూడా పని చెయ్యనున్నారు. జేబీ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి స్వయంగా సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

తాజా వార్తలు