అగ్గిపుల్ల వెలిగిస్తానంటున్న సుదీర్ బాబు

అగ్గిపుల్ల వెలిగిస్తానంటున్న సుదీర్ బాబు

Published on Apr 10, 2012 11:18 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు బావగా, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీర్ బాబు తన రెండవ చిత్రం త్వరలో చేయబోతున్నాడు. ఆకెళ్ళ వంశి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘అగ్గిపుల్ల’ అనే టైటిల్ ఖరారు చేసారు. గత కొద్ది రోజులుగా ఈ టైటిల్ అనుకుంటున్నట్లుగా పుకార్లు వినిపిస్తుండగా ఈ విషయాన్నీ సుదీర్ బాబు స్వయంగా ధ్రువీకరించాడు. డాన్సుల్లో, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకోవడానికి సుదీర్ బాబు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే ఈ అగ్గిపుల్ల సినిమా ప్రారంభం కానుంది.

తాజా వార్తలు