సుకుమార్ అసోసియేట్ తో చిత్రం ఒప్పుకున్న సుదీర్ బాబు

సుకుమార్ అసోసియేట్ తో చిత్రం ఒప్పుకున్న సుదీర్ బాబు

Published on Nov 18, 2012 2:23 AM IST


సుధీర్ బాబు ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది “ఎస్ ఎం ఎస్” చిత్రం తరువాత చాలా రోజుల పాటు ఎటువంటి చిత్రం ఒప్పుకొని ఈ నటుడు తాజాగా జే ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతీ నిర్మిస్తున్న “ప్రేమకథ చిత్రమ్” చిత్రాన్ని ఒప్పుకున్నారు. “ఎస్ ఎం ఎస్ చిత్రంతో వచ్చిన పేరుని పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు మారుతీ చెప్పిన కథ చాలా బాగుంది మరో రెండు కథలు నచ్చాయి. రాబోయే ఏడాదిన్నరలో నాలుగు చిత్రాలను చేయ్యనున్నాను” అని సుదీర్ బాబు అన్నారు. సుకుమార్ దగ్గర “ఆర్య-2” మరియు “100%లవ్” వంటి చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన మున్నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నట్టు చెప్పారు. “అందాల రాక్షసి” ఫేం రధన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

తాజా వార్తలు