సుధీర్ బాబు లేటెస్ట్ థ్రిల్లర్ ‘జటాధర’.. ఈ ఓటిటిలో స్ట్రీమింగ్!

సుధీర్ బాబు లేటెస్ట్ థ్రిల్లర్ ‘జటాధర’.. ఈ ఓటిటిలో స్ట్రీమింగ్!

Published on Dec 5, 2025 9:00 AM IST

Jatadhara
టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే “జటాధర”. వరుస పరాజయాలు తర్వాత సుధీర్ బాబు ఈ సినిమాపై మంచి నమ్మకంతో విడుదల చేసాడు కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. అయితే ఈ సినిమా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ సినిమా కోసం చూస్తున్న వారు అప్పుడు థియేటర్స్ లో మిస్ చేసిన వారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించగా ఆమె ఈ సినిమా తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా లు నిర్మాణం వహించగా వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు