విడుదల తేదీ : నవంబర్ 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ
దర్శకుడు : వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్
నిర్మాతలు : ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా
సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్
సినిమాటోగ్రాఫర్ : సమీర్ కళ్యాణి
ఎడిటర్ : నవీన్ నూలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తుం సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
శివ (సుధీర్ బాబు) ఒక కార్పోరేట్ జాబ్ చేస్తున్నప్పటికీ ఖాళీ సమయంలో మాత్రం తన ఫ్రెండ్స్ తో కలిసి దయ్యాల వేట కూడా చేస్తూ ఉంటాడు. దయ్యాలు లాంటివి లేవని బలంగా నమ్మే తాను ఒక పీడకల చేత వేదించబడుతూ ఉంటాడు. ఒకటే కల తనకి తరచూ వస్తూ ఉంటుంది. మరి ఆ కలలో తనకి కనిపించింది ఏంటి? ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కి భూమి లోపల దాగి ఉన్న అపారమైన నిధికి ఉన్న కనెక్షన్ లు ఏంటి? శివ తన కోసం ఏం తెలుసుకున్నాడు? చివరికి ఎవరికి ఏమయింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ప్రతీ సినిమాకి ఎంతో సిన్సియర్ గా వర్క్ చేసే సుధీర్ బాబు నుంచి ఇది కూడా మరో హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. తన డెడికేషన్ ఈ సినిమాలో చాలా బాగుంది. నటన పరంగా కానీ ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో గాని సుధీర్ తన బెస్ట్ ని మరోసారి అందించాడు. నటుడుగా మాత్రం సుధీర్ ప్రతీ సినిమాకి అంతకంతకూ బెటర్ అవుతూ వెళుతుండడం మాత్రం మంచి విషయం.
ఇక బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి తెలుగులో ఇది మంచి డెబ్యూ అనే అని చెప్పవచ్చు. ఆమె ధన పిశాచిగా ఆమె తన రోల్ లో ఫిట్ అయ్యి మంచి నటన ఆమె కనబరిచింది. ఇక వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఇది వరకు వచ్చిన కొన్ని సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ తో పోలిస్తే జటాధర లో డిఫరెంట్ లైన్ నే కనిపిస్తుంది కానీ మంచి కథ అందరికీ చేరువ కావాలంటే అంతే రీతిలో ఎంగేజింగ్ గా సాగే కథనం కూడా కావాలి. మరి డిజప్పాయింటింగ్ గా అదే ఈ సినిమాకి మిస్ అయ్యింది. మంచి కథ ఉన్నప్పటికీ అది ఈ సినిమాలో ఎంగేజింగ్ గా అయితే సాగలేదు.
చాలా వరకు స్క్రీన్ ప్లే ఈ సినిమాలో వీక్ అండ్ సింపుల్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాలో మెయిన్ గా ఫస్టాఫ్ పెద్దగా ఏమి లేదు అనిపిస్తుంది. ఎటెటో సాగుతూ చాలా రొటీన్ అండ్ బోరింగ్ గా ఈ ఫస్టాఫ్ కథనం వెళుతుంది. అలాగే సినిమాలో ఆ లవ్ ట్రాక్ ఇంకా, ఐటెం సాంగ్ లాంటివి ఫ్లోలో అనవసరంగా ఇరికించినట్టుగా అనిపిస్తుంది.
ఇక సెకండాఫ్ మొదలయ్యాక కొంతసేపు వరకు బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ రొటీన్ ఫీల్స్ నే మిగులుస్తుంది. పెద్దగా లేయర్స్ లేకుండా ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యాక సినిమా వెంటనే క్లైమాక్స్ కి షిఫ్ట్ అయ్యిపోవడం అంతా సంబంధం లేకుండా ఒక ఫ్లో లేనట్టుగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో వి ఎఫ్ ఎక్స్ కూడా వీక్ గానే ఉన్నాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు అంతగా బాలేవు. సెట్ వర్క్స్ వరకు ఓకే కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా పేలవంగా తీసేసారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు ఎక్కడా ఇంపాక్ట్ చూపించలేదు. ఎడిటింగ్ కూడా బాలేదు.
ఇక దర్శకులు వెంకట్ కళ్యాణ్ అలాగే అభిషేక్ జైస్వాల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి తమ పనితనం వీక్ గా ఉంది. ఇద్దరు దర్శకులు పని చేసినప్పటికీ ఇద్దరూ సరైన విధంగా కథనాన్ని నడిపించడంలో విఫలం అయ్యారు. చేతిలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా మంచి ఎంగేజింగ్ గా సాగే కథనాన్ని వీరు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీరి వర్క్ మాత్రం మెప్పించలేదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘జటాధర’లో మంచి లైన్ ఉంది, సుధీర్ బాబు సిన్సియర్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. కానీ మెయిన్ గా సినిమా కథనంలో పస లేదు. వీక్ దర్శకత్వం, పేలవమైన నిర్మాణ విలువలు సినిమా టోటల్ అవుట్ పుట్ ని దెబ్బ తీశాయి. వీటితో ఈ సినిమాని స్కిప్ చేస్తే బెటర్.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


