‘సడన్ స్టార్’ ఎవరో గుర్తున్నారా? ఇంకెవరూ మన కామెడీ కింగ్ అల్లరి నరేష్. నరేష్ ‘సడన్ స్టార్’ వచ్చిన ‘సుడిగాడు’ చిత్రం విడుదలై ఈ రోజుతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సూపర్బ్ కామెడీ చేసారు. అల్లరి నరేష్ కెరీర్లోనే అత్యధిక గ్రాసర్ గా నిలిచింది మరియు ఈ చిత్రానికి పని చేసిన వారికి మరియు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ‘ ఒకప్పుడు విజయం అంటే సినిమా ఎక్కువ రోజులు ఎన్ని థియేటర్లలో ఆడితే దానిబట్టి ఎంత పెద్ద హిట్టా అని నిర్ణయించేవారు. ఇప్పుడు అది మారిపోయింది సినిమా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుంటున్నారు మరియు ఎంత కలెక్షన్స్ సాదించింది అనే దాని మీద హిట్ ని నిర్ణయిస్తున్నారు. ఆ విషయంలో మాకు చాలా ఆనందంగా ఉంది. అటు కలెక్షన్స్ బాగున్నాయ్ మరియు 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది’ అని ఆయన అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించారు. శ్రీ వసంత్ సంగీతం అందించారు. ‘సుడిగాడు’ చిత్రంతో సుడి తిరిగిన అల్లరి నరేష్ కి మా అభినందనలు తెలియజేస్తున్నాం.