కామెడీ కింగ్ సునీల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూలరంగడు’ ఆడియో ఈ రోజు విడుదల కానుంది. ఈ వేడుకకి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం మాకు లభించింది. విశ్వనీయ సమాచారం ప్రకారం నాగ చైతన్య మరియు అల్లరి నరేష్ ఈ వేడుకకి హాజరు కానున్నారు.
స్టార్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్, సుకుమార్ మరియు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా విచ్చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా వచ్చే అవకాశం ఉంది. పూలరంగడు చిత్రాన్ని సక్సెస్ఫుల్ దర్శకుడు వీర భద్రమ్ డైరెక్ట్ చేయగా సునీల్ ఇషా చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతుంది. పూలరంగడు చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి నిర్మించారు.