సౌందర్య బయోపిక్ లో స్టార్ హీరోయిన్ !

ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన ప్రముఖుల జీవితం ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కించడం అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి, ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’లతో పాటు ఇంకా కొన్ని జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చి వారి వారి అభిమానులను అలరించాయి. అలాగే ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సౌందర్య జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. అయితే ఈ బయోపిక్ లో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, సౌందర్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సహజ నటిగా సౌందర్య సాధించిన ఘనతలను కూడా ఆమె బయోపిక్ లో భాగం చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో అన్ని అంశాలను పెట్టారట దర్శకనిర్మాతలు. అయితే ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.

Exit mobile version