‘యాత్ర 2’లో జగన్ పాత్రలో స్టార్ హీరో ?

‘యాత్ర 2’లో జగన్ పాత్రలో స్టార్ హీరో ?

Published on Sep 13, 2020 11:07 PM IST

దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘యాత్ర’ సక్సెస్ కావడంతో.. మహి వి రాఘవ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ఇటీవలే ఓ సందర్భంలో.. తానూ ‘యాత్ర 2’ను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నానని మహి వి రాఘవ్ చెప్పడంతో.. యాత్ర 2లో నటించే హీరో ఎవరు అని అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

కాగా తాజాగా యాత్ర 2లో వైయస్ జగన్ పాత్రలో స్టార్ హీరో నాగార్జున కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య సూర్య కూడా జగన్ పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే యాత్ర 2 కోసం వైఎస్సార్ మరియు జగన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర దగ్గర్నుండే యాత్ర 2 ఉంటుందని.. తమ అభిమాన నాయకుడి బయోపిక్ ను త్వరలోనే స్క్రీన్ మీద చూడొచ్చు అని.. జగన్ అభిమానులు సైతం యాత్ర 2 పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

తాజా వార్తలు