హీరోయిన్ శృతి హాసన్ ఈ రోజు ఉదయం ముంబైలో భయానికి గురైంది. శృతి హాసన్ పై తన అపార్ట్ మెంట్ లో ఓ గుర్తు తెలియని దుండగుడు అటాక్ చేసాడు. ఆ సమయంలో అతను ఎవరు అనేది కరెక్ట్ గా గుర్తించలేకపోయారు.
అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ముంబై లోని శృతి హాసన్ అపార్ట్ మెంట్ డోర్ ని ఉదయాన్నే ఎవరో ఓ వ్యక్తి డోర్ కొట్టాడు. ఎప్పటిలానే శృతి డోర్ ఓపెన్ చేసింది. ఆ వ్యక్తి వేగంగా లోపలి దూసుకొచ్చి శృతి మెడ పట్టుకున్నాడు. ఎలాగాలో తట్టుకున్న శృతి కాసేపటికి అతన్ని బయటకి తోయడంలో అతని చేయి డోర్ లో ఇరుక్కుంది. ఎలాగో లాక్కొని ఆ దుండగుడు పారిపోయాడు.
ఈ వార్తని ఫిల్మ్ ఫేర్ వారు, జితేష్ పిళ్ళై పోస్ట్ చేసారు. ‘ శృతి హాసన్ ఈ రోజు ఒక భయంకరమైన సంఘటనని ఎదుర్కొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన అపార్ట్ మెంట్ దగ్గరికి వచ్చి ఆమె పై అటాక్ చేసాడు. కానీ డేరింగ్ గా బిహేవ్ చేసిన శృతి అతని నుంచి తప్పించుకుంది. అతని చేయి డోర్ దగ్గర కాసేపు ఇరుక్కుపోయిందని’ జితేష్ పిళ్ళై ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం ఈ వార్త బాగా ప్రచారం అవుతోంది. కానీ ఈ విషయం పై అధికారిక అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటికైతే శృతి నువ్వు చాలా బలవంతురాలివి అని మాత్రం చెప్పగలము.