సాయి కొర్రపాటితో ‘భళా తందనాన’ అంటున్న రాజమౌళి, పురాణపండ శ్రీనివాస్.

puranapanda srinivas , bhala thandanana

హైదరాబాద్ : ఫిబ్రవరి : 16

తెలుగు చలన చిత్రపరిశ్రమకు అద్భుత చిత్రాలు సమర్పించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ‘ భళా తందనాన ‘ అనే సరిక్రొత్త చిత్రానికి ఈ మంగళవారం ఉదయం శ్రీకారం చుట్టింది.

రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో అతిరధ మహారథుల సమక్షంలో హీరో , హీరోయిన్లపై ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా , దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో నిర్మించబడుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా విశేషాల్లో శ్రీమతి వల్లీ కీరవాణి, శ్రీమతి రమా రాజమౌళి, ఈ చిత్ర దర్శకులు చైతన్య దంతూరి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

నాలుగైదు సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీ విష్ణు ఈ సినిమాకి హీరో కాగా , ప్రముఖ కథానాయిక కేథరిన్ హీరోయిన్ కావడం మరొక విశేషం.

త్రిబుల్ ఆర్ సినిమా చివరి షెడ్యూల్ లో బిజీ గా ఉన్న రాజమౌళి షూటింగ్ మధ్యలో కాస్సేపు ఆపి తన సన్నిహితుడు సాయి కొర్రపాటి గురించి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో కలిసి ఈ వేడుకకు హాజరవ్వడం అందరినీ ఆనందపరిచింది.

వినూత్నమైన పేరుతో ‘ భళా తన్దనానా ‘ గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలూ సమకూరుస్తున్నారు.

చాలా కాలం తర్వాత రామానాయుడు స్టూడియోకి విచ్చేసిన పురాణపండ శ్రీనివాస్ చుట్టూ గుమిగూడిన రామానాయుడు స్టూడియో సిబ్బంది సుమారు పదినిమిషాలపాటు ఆత్మీయంగా పలకరించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Exit mobile version