రామయ్యా వస్తావయ్యా లో తన పాత్రపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన శృతి

రామయ్యా వస్తావయ్యా లో తన పాత్రపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన శృతి

Published on Sep 28, 2013 12:30 AM IST

Shruti-Haasan
టాలీవుడ్ మరియు బాలీవుడ్ లలో వరుస విజయాలను అందుకుంటూ శృతిహాసన్ మంచి జోరు మీద వుంది. ప్రస్తుతం ఆమె చేతిలో వున్న సినిమాలలో ముందు ‘రామయ్యా వస్తావయ్యా ‘ ఆ తరువాత ‘ఎవడు’ విడుదలకానున్నాయి

ఈ మధ్య రామయ్యా వస్తావయ్యా సినిమాలో శృతి నెగిటివ్ రోల్ పోషిస్తుంది అన్న పుకార్లు హల చల్ చేసాయి. వీటిని శృతి ఖండిస్తూ “అందరూ చెబుతున్నట్టుగా రామయ్యా వస్తావయ్యా లో నేను నెగిటివ్ రోల్ చెయ్యట్లేదు. ఇది ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఎప్పియరెన్స్. మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని ట్వేట్ చేసింది.

ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు