మక్కీ ని ప్రశంసించిన షారుఖ్ ఖాన్

మక్కీ ని ప్రశంసించిన షారుఖ్ ఖాన్

Published on Oct 6, 2012 8:00 PM IST


ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన “మక్కీ” చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. “ఈగ” చిత్రానికి హిందీ అనువాదం అయిన ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శన తరువాత బాలివుడ్ విమర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తారు. అన్నింటికన్నా పెద్ద ప్రశస అంటే షారుఖ్ ఖాన్ నుండి వచ్చిందే ఈ చిత్రం చూసాక “మక్కీ చిత్రం చాలా బాగుంది రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు అక్టోబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. అందరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి స్పందిస్తూ ఎస్ ఎస్ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఎవరో కూడా తెలియని నాలాంటి వాడిని ఇలా ప్రోత్సహించడం చాలా ఆనందం కలిగించే విషయం అని రాజమౌళి అన్నారు. చూస్తుంటే రాజమౌళి బాలివుడ్లో చిత్రం నేరుగా చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. “మక్కీ” నాని,సుదీప్ మరియు సమంత ప్రధాన పాత్రలలో నటించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా కే కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ బాబు మరియు సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు హిందీలో ఈ చిత్రాన్ని రిలయన్స్ వారు పంపిణి చేస్తున్నారు. అక్టోబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు