యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 5న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ చిత్ర హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్.టి.ఆర్, అలాగే ప్రొడక్షన్ టీం అందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్.టి.ఆర్ మనసులో ఏం దాచుకోకుండా సూటిగా మాట్లాడారు అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేశారు.
‘బాద్షా కి సంబందించిన ఫుల్ క్రిడిట్ అంతా శ్రీను వైట్ల కే చెందుతుంది. నా డ్రెస్సింగ్ స్టైల్, నా కాస్ట్యూమ్స్ చివరికి సినిమాలో నేను వాడే వాచ్ విషయంలో కూడా శ్రీను ఎంతో పర్సనల్ గా కేర్ తీసుకున్నారు. సినిమా ఈ రోజు చాలా గ్రాండ్ గా రిచ్ ఫీల్ తో ఉందంటే దానికి కారణం శ్రీను వైట్ల. కొంతమంది విక్టరీకి గౌరవం ఇస్తారు కానీ దాన్ని తలకి ఎక్కించుకోరు అలాంటి వాళ్ళలో శ్రీను వైట్ల ఒకరని ‘ ఎన్.టి.ఆర్ అన్నాడు
శ్రీను వైట్ల కూడా ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడుతూ ‘ నేను చేసిన సినిమాలకంటే ఎన్.టి.ఆర్ ఎక్కువ సినిమాలు చేసాడు కావున ఎన్.టి.ఆర్ నాకన్నా సీనియర్. అంత సీనియర్ అయినా ఎప్పుడూ నన్ను ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించలేదు, నేను ఏమడిగానో అవన్నీ చేసారు. ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ ని కాస్త ఎక్కువగానే కష్టపెట్టాను కానీ అదంతా సక్సెస్ కోసమే. బాద్షా షూటింగ్ మొదలు కాకముందు నేను కొంతమంది ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ని కలిసాను వాళ్ళందరూ ఎన్.టి.ఆర్ నుంచి అదిరిపోయే డాన్సులు కావాలన్నారు. వాళ్ళు అడిగిన డాన్సులు ఈ సినిమాలో ఉంటాయి అలాగే ఎన్.టి.ఆర్ దేవుడు మనకిచ్చిన గొప్ప డాన్సర్’ అని అన్నాడు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మించారు.