పట్టాయలో శ్రీకాంత్ శత్రువు

పట్టాయలో శ్రీకాంత్ శత్రువు

Published on Oct 9, 2012 10:00 PM IST


శ్రీకాంత్ మరియు అక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “శత్రువు”. ఈ చిత్రం ప్రస్తుతం థాయ్ ల్యాండ్లోని పట్టాయ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మధ్యనే మొదలయిన చివరి షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. “శత్రువు చిత్రం కోసం పట్టాయలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు నా జీవితంలో చాలా కష్టమయిన రోజులను గడుపుతున్నాను. ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితులు చిత్రీకరణ మొదలు కాకముందే బాగోలేకుండా పోయాయి” అని అక్ష ట్విట్టర్లో తెలిపారు. ఎన్ ఎస్ ఆర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి ఎస్ రామిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం ఇప్పటికే చిత్రీకరించేశారు త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. గుణ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు