మళ్లీ కామెడీ చేస్తానంటున్న శ్రీకాంత్

మళ్లీ కామెడీ చేస్తానంటున్న శ్రీకాంత్

Published on Oct 1, 2013 12:33 AM IST

srikanth
హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. ఆయన గత ఐదారు సినిమాలుగా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. కానీ ఈ సారి పూర్తిస్థాయి కామెడీ సినిమా చెయ్యడానికి సిద్ధపడ్డాడు ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ అనే టైటిల్ తో సాగే ఈ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్విస్తాయట. స్వతహాగా రచయిత అయిన ఉదయ రాజ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నాడు. స్వాతి మరియు సీతారామరాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు మనోచిత్ర హీరోయిన్ గా పరిచయంకానుంది. అక్టోబర్ 5 నుండి పాటలను చిత్రీకరించనున్నారు. ఆడియో మరియు సినిమా విడుదలవివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు