మామూలుగా మన సౌత్ ఇండియన్ స్టార్స్ కి ఇతర దేశాల్లో పెద్ద క్రేజ్ ఉండదు. ఒక్క సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కి మాత్రమే జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ ఇంతా భారీగా రిలీజ్ అవుతాయో అక్కడ కూడా అదే రేజ్ లో రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీ తర్వాత స్థానాన్ని డ్రీం గర్ల్ శ్రీ దేవి దక్కించుకుంది. ఐదు పదుల వయసులో కూడా శ్రీదేవి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. ఆమె దాదాపు 20 సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చి చేసిన సినిమా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఇక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చెయ్యాలని అక్కడి నిర్మాత బాల్కీ ప్లాన్ చేసారు అందులో భాగంగానే ‘ఐచి ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఈ సినిమాని ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ రావడంతో శ్రీ దేవి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
నిర్మాత బాల్కీ మాట్లాడుతూ ‘ ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే రేంజ్ లో శ్రీదేవి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక్కడి మహిళలందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే రజినీ తర్వాత ఇక్కడ అంతటి క్రేజ్ ఒక్క శ్రీదేవికే ఉందని’ అన్నాడు.