మంచు విష్ణు కమిట్మెంట్ పై శ్రీను వైట్ల ఆసక్తికర ట్వీట్.!

మంచు విష్ణు కమిట్మెంట్ పై శ్రీను వైట్ల ఆసక్తికర ట్వీట్.!

Published on Feb 4, 2021 9:00 AM IST

సినిమాలో రోల్ మరియు స్రిప్ట్ డిమాండ్ చేస్తే మన తెలుగు హీరోలు ఎంత వరకు అయినా కష్టపడతారు. మరి అలాగే ఇప్పుడు మంచు వారి హీరో మంచు విష్ణు తన “డబుల్ డోస్” చిత్రానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన సెన్సేషనల్ హిట్ కాంబో శ్రీను వైట్లతో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అప్పుడు వచ్చిన “ఢీ” చిత్రం భారీ హిట్ కావడంతో దీనిపై కూడా మంచి అంచనాలు సెట్టయ్యాయి. మరి ఈ సినిమాకు గాను మంచు విష్ణు ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో ఆ మధ్య ఒక వీడియో మరియు ఫోటోలు బయటకు వచ్చాయి. మరి ఇంతలా కష్టపడుతున్న తన హీరో కోసం ఓ ఆసక్తికర ట్వీట్ నే పెట్టారు.

ఓ ఫొటోతో ఈ సినిమా కోసం ఇంత కమిట్మెంట్ తో హార్డ్ వర్క్ చేస్తున్న తమ హీరోకు అంతే స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నామని తమ సమిష్టి కృషికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని తెలిపారు. అలాగే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు