‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో చేస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మరి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఇప్పుడు ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్టు టాక్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా సినిమా సెట్స్ నుంచి ఇద్దరు హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా కలిసి కనిపించిన క్యూట్ మూమెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. శ్రీలీలతో రాశి ఖన్నా క్లోజ్ తీసుకున్న సెల్ఫీ షేర్ చేసుకుంది. అయితే తన షూటింగ్ టైం లో ఈ క్యూటీ శ్రీలీల వచ్చింది అంటూ తాను పోస్ట్ చేసింది. సో ఇపుడు సెపరేట్ పోర్షన్స్ చిత్రీకరిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version