‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ

Mirai-0

ఇటీవల మన తెలుగు సినిమా నుంచి వస్తున్న సినిమాల్లో యువ దర్శకులు తమ సత్తా చాటుతూ గ్రాండ్ విజువల్ ట్రీట్ ని అయితే అందిస్తున్నారు. మరి ఈ సినిమాలలో లేటెస్ట్ గా వస్తున్న అవైటెడ్ చిత్రమే “మిరాయ్”.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా ఈగల్ సినిమాతో మనకి కూడా ఒక లోకేష్ కనగరాజ్ ఉన్నాడు అని చూపించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సినిమాలో AI విజువల్స్ ఉన్నాయని ఓ టాక్ సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గం మీడియా పీపుల్ లో కూడా ఉంది.

ముఖ్యంగా మొన్న టీజర్ లో వచ్చిన విజువల్స్ కూడా కొన్ని AI తో చేసినవే అని చాలా సింపుల్ గా కూడా మాట్లాడేశారు. కానీ ఈ కామెంట్స్ అన్నిటినీ యంగ్ హీరో ఖండించాడు. ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నామని అలాంటి వాటిలో AI సాయం తీసుకున్నాం అనేది చాలా సిల్లీ అంశం అని కొట్టి పారేసాడు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికే ఒక సీజీ కంపెనీ ఉందని ఈ సినిమా కోసం సీజీ టీం అంతా రోజుకి 18 గంటలు వర్క్ చేసేవారని తన దగ్గర సీజీ వర్క్ తాలూకా ఫుటేజ్ కూడా ఉందని చూపించడం జరిగింది. దీనితో మిరాయ్ విషయంలో జరుగుతున్నా నెగిటివ్ కామెంట్స్ ని తేజ సజ్జ సైలెన్స్ చేసేశాడని చెప్పవచ్చు.

Exit mobile version