మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?

Mirai

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అయితే, ఈ క్రమంలో ఈ సినిమా తో తేజ తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయగలడా అనే సందేహం పలువురిలో నెలకొంది.

హనుమాన్ చిత్రంలో సూపర్ హీరో గా తేజ కనిపించడం ప్రేక్షకులను మెప్పించింది. అందులోని డివోషనల్ టచ్, గ్రాఫిక్స్ వర్కౌట్ కావడం తో సినిమా ఊహించని రేంజ్ లో హిట్ అయింది. కానీ ఇప్పుడు మిరాయ్ లో సూపర్ యోధుడుగా ఉన్నా, తేజ పైనే ఎక్కువ భారం కనిపిస్తుంది. మరి సోలోగా ఈ సినిమా కు సక్సెస్ ని తేజ తీసుకొస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version