బాక్సాఫీస్ దగ్గర ఈ శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఘాటి, మాదరాసి, లిటిల్ హార్ట్స్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాయి. అయితే లిటిల్ హార్ట్స్ చిత్రం మంచి టాక్ తో దూసుకెళ్తుంది. మిగతా రెండు సినిమాలు పెద్దగా మెప్పించలేక పోయాయి. కానీ తెలుగు ఆడియన్స్ ఈ మూడు చిత్రాలను కాదని దెయ్యాలకే ప్రిఫెరెన్స్ ఇస్తున్నారు.
హాలీవుడ్ లో కన్జ్యూరింగ్ సిరీస్ చిత్రాలకు సాలిడ్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి లాస్ట్ రైట్స్ అనే సినిమా రిలీజ్ అయింది. హారర్ చిత్రాల ఆడియన్స్ కి ఇది బాగా ఎక్కేసింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ సినిమాలను కాదని, ఈ హాలీవుడ్ చిత్రానికే ఎక్కువ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఏదేమైనా అనుష్క శెట్టి, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్ ని కాదని మూవీ లవర్స్ దెయ్యాలకే ప్రిఫెరెన్స్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.