అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ ని కొనసాగుతుంది.

ఆల్రెడీ నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ మార్క్ గ్రాస్ ని దాటేసిన ఓజి ఇపుడు మరో సాలిడ్ ఫీట్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో ఓజి కి ఒక్క నార్త్ అమెరికా గడ్డపైనే 40 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. దీనితో ఓజి ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version